ప్రధాని మోదీ మరోసారి జమిలి ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు. ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ 80వ సమావేశాల కోసం ఇచ్చిన సందేశంలో ఒకే దేశం- ఒకేసారి ఎన్నికల అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడి0చారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం భారత్‌కు అవసరమని ప్రధాని పునరుద్ఘటించారు. జమిలి ఎన్నికల అంశంపై కేవలం చర్చ పెట్టి వదిలేస్తే సరిపోదని.. ఆ విధానం ఇండియాకు చాలా అవసరమని ప్రధాని అభిప్రాయపడ్డారు.
ప్రతి నెలా ఏదో ఒక ప్రదేశంలో ఎన్నికలు జరుగుతున్నాయన్న మోదీ.. ఆ ఎన్నికల ప్రభావం అభివృద్ధి పనులపై చూపుతున్న విషయం అందరికీ తెలిసిందేన్నారు. ఈ విషయాన్ని సమగ్రంగా పరిశీలించాలని.. దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్లే మార్గదర్శకులు అవుతారని ప్రధాని కోరారు. భారత రాజ్యాంగంలో ఎన్నో అంశాలు ఉన్నాయని.. కానీ అన్నింటికంటే ప్రధానమైనది విధులు నిర్వర్తించడమేనని చెప్పుకొచ్చారు.