మహరాష్ట్రలో కొనసాగుతున్న మహా నాటకానికి కేంద్రం చెక్ పెట్టింది. ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ లేకపోవటం, గవర్నర్ ఇచ్చిన గడువులోపు శివసేనతో పాటు ఎన్సీపీలు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవటంతో గవర్నర్ సిఫారసు మేరకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.
బీజేపీ-శివసేన ఒక కూటమిగా, కాంగ్రెస్-ఎన్సీపీ ఒక కూటమిగా మహరాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేశాయి. అయితే నాలుగు పార్టీలకు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే మెజారిటీ రాకపోవటం, శివసేన 50-50 ఫార్మూలాలో సీఎం కుర్చీని కూడా కలపాల్సిందేనని భీష్మించుకు కూర్చోవటంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఇటు కాంగ్రెస్ చివరి నిమిషంలో శివసేన ప్రభుత్వం ఏర్పాటుకు షరతులు విధించటంతో… గవర్నర్ గడువు ముగిసిపోయింది. దాంతో గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయటం, కేంద్రం ఓకే అనటం, రాష్ట్రపతి ఆమోదముద్ర వేయటం చకచకా జరిగిపోయాయి.