ప్రపంచం అంతా కరోనా వైరస్ విస్తరిస్తుందన్న రిపోర్టులు వస్తూనే ఉన్నాయి. ఇటలీ, అమెరికాలో అప్పటికే కేసుల సంఖ్య పెరుగుతుంది. యూరప్ దేశాల నుండి వచ్చే ప్రయాణికులపై చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. కానీ ఇండియా మేలుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వం, ఆయా నిఘా వ్యవస్థల దారుణ వైఫల్యానికి ఇప్పుడు ఇండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
మార్చి రెండో వారంలో నిజాముద్దీన్ ప్రాంతంలో మత ప్రార్థనలు జరిగాయి. ఆ మీటింగ్ కోసమే ఇండోనేషియా, గల్ఫ్, యూరప్ నుండి ప్రతినిధులు వచ్చారు. కానీ అప్పటికే ఆయా దేశాల్లో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుందన్న అంశాన్ని మర్చి కేవలం థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా జ్వరం చెక్ చేసి పంపించారు. కానీ వారికి వీసాలు నిరాకరించలేదు.
ఫలితంగా ఇప్పుడు ఇండియా కరోనా వైరస్ కు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. కేవంల తెలుగు రాష్ట్రాల నుండి 1700మంది వరకు ఆ ప్రార్థనలకు హాజరయ్యారు. స్థానిక పోలీసులు కూడా చూసి చూడనట్లు వ్యవహరించారు తప్పా ఆంక్షలు విధించలేదు. తమిళనాడు, కేరళ ఇలా చాలా రాష్ట్రాల నుండి హజరైన వారు ఇంటికి చేరుకున్నారు. ఇప్పుడు వారందరికీ కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి.
పోనీ ఇప్పుడున్న బాధ్యతగా జరగాల్సింది చూడాల్సింది పోయి… బీజేపీ ఐటీ సెల్ ఓ మతాన్ని టార్గెట్ చేసుకొని ప్రచారం చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో కూడా రాజకీయమా…? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.