మోడీ సర్కార్ పై తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. అసత్యాలను ప్రచారం చేయడంలో జర్మనీ నియంత హిట్లర్‌ను ప్రధాని మోడీ మించి పోయారన్నారు.
బీబీసీ ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో రెండో రోజు ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమలో దీనిపై ఆయన స్పందిస్తూ కేంద్రంపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.
వాస్తవాలను చెప్పే మీడియాను వేధించి అబద్దాలను ప్రచారం చేయడంలో రష్యాలో పుతిన్, నాటి జర్మనీ నియంత హిట్లర్, ఇటలీలో ముస్సోలినీలను ప్రధాని మోడీ మించిపోయారని ట్వీట్ చేశారు.
మరో వైపు బీబీసీపై ఐటీ దాడులను ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ క్లబ్ ఖండించింది. మోడీ విషయంలో వాస్తవాలను వెలుగులోకి తీసుకు వచ్చిందనే అక్కసుతోనే బీబీసీపై కేంద్రం దాడులు చేస్తోందన్నాయి.