ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలకు సీఈవోలుగా భారతీయ యువకులే ఉండటం దేశానికి గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (PMRBP) గ్రహీతలతో ఆయన ముచ్చటించారు. వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మోడీ ఈ అవార్డులు మీపై మరింత బాధ్యతను పెంచుతున్నాయని చెప్పారు.
స్నేహితులు, కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఈ అవార్డు గ్రహీతలపై అంచనాలు పెరుగుతాయని అన్నారు. ప్రపంచంలోని అన్ని దిగ్గజ కంపెనీలో కూడా భారతీయ యువత గొప్ప స్థాయిలో ఉన్నారని మోడీ గుర్తు చేశారు.
స్టార్టప్‌ల ప్రపంచంలో యువత బాగా రాణిస్తున్నారని.. ఈ విధంగా దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఒకప్పుడు బాలికలు ఇల్లు దాటి బయటకు వెళ్లేవారు కాదని.. కానీ, ఇప్పుడు వారే అద్భుతాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
ప్రతీ ఏడాది గణతంత్ర దినోత్సవానికి ముందు PMRBP అవార్డులు అందిస్తారు. కళలు, సామాజిక బాధ్యత, సంస్కృతి రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన బాలలకు ఇస్తారు.1996 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలు ప్రజెంట్ చేస్తుంది.