న్యూయార్క్ లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. యూఎన్ 76వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. దీనికి సంబంధించిన వివరాల్ని ఆయన ట్వీట్ చేశారు. న్యూయార్క్ చేరుకున్నా… సాయంత్రం 6.30 గంటలకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తానంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు మోడీ.
న్యూయార్క్ చేరుకున్న ప్రధానిని ఎన్నారైలు కలిశారు. ఆయన బస చేసే హోటల్ దగ్గరకు భారీగా వచ్చిన ప్రవాస భారతీయులు వందేమాతరం, భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తించారు. అక్కడకు వచ్చిన వారందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ ఆత్మీయంగా పలకరించారు మోడీ.