పాకిస్థాన్ డే సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ… పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు లేఖ రాశారు. పాక్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్ తో స్నేహపూర్వక సంబంధాలను తాము ఎల్లప్పుడూ కోరుకుంటున్నామని, నమ్మకంపైనే ఈ సంబంధాలు నిలబడి ఉంటాయని తెలిపారు. అయితే… పాక్ ఉగ్రవాదానికి దూరంగా ఉండాలని కోరారు.
ఇటీవల ఇమ్రాన్ ఖాన్ కరోనా బారిన పడిన సమయంలో… త్వరగా కోలుకోవాలంటూ మోడీ ట్వీట్ చేశారు. ఇప్పుడు లేఖ రాశారు. గతంలోనూ ఇలాగే చేశారని…. మోడీకి బదులుగా ఇతర పార్టీల నేతలు ఎవరైనా ఇలాగే స్పందిస్తే బీజేపీ నేతలు ఏమనేవారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినపడుతున్నాయి. ఇవన్నీ దేశం కోసం… ధర్మం కోసమేనా అంటూ సెటైర్స్ వేస్తున్నారు.
అయితే, ఈ లేఖ ప్రతి సంవత్సరమూ పంపించే రొటీన్ లెటర్ మాత్రమేనని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.