టీడీపీ నేత, నటుడు తారకరత్న మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన ఆయన తారక్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
‘‘శ్రీ నందమూరి తారకరత్న గారి అకాల మరణం బాధాకరం. చలనచిత్ర, వినోద ప్రపంచంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు ఆయన కుటుంబం, అభిమానులతోనే ఉన్నాయి. ఓం శాంతి’’ అని ట్వీట్ చేశారు మోడీ.
ఇటు తారకరత్న భౌతికకాయాన్ని ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. తారకరత్న నివాసానికి చేరుకున్న చంద్రబాబు నాయుడు.. కుటుంబ సబ్యులకు ధైర్యం చెప్పారు.
తారకరత్న పార్ధివదేహాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు జూనియర్ ఎన్టీఆర్. బరువెక్కిన గుండెతో అన్నకు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ తోపాటు కళ్యాణ్ రామ్, ఇతర ప్రముఖులు నివాళులు అర్పించారు.