దేశ ప్రజలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని ట్వీట్ చేశారు. దేశంతోపాటు విదేశాల్లో ఉన్న భారతీయులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరం ప్రతీ ఒక్కరి జీవితంలో కొత్త ఉత్తేజాన్ని నింపి సమాజ శాంతికి ఉపయోగపడుతోందని ఆకాంక్షించారు. ప్రజలు అంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటూ స్వప్రయోజనాలతో పాటు, సమాజ ప్రయోజనాలను ఆశిస్తూ.. దేశాన్ని ముందుకు నడిపించే శక్తి అందరిలో ఉండాలని రాష్ట్రపతి కోరుకున్నారు.
కొత్త సంవత్సరం దేశ ప్రజల జీవితాల్లోకి కొత్త వెలుగులు నింపాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. మనలో ప్రతిభను గుర్తించి ఉన్నత శిఖరాలను చేరుకొని దేశాన్ని ముందుకు నడిపించాలని అన్నారు. మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను నెరవేర్చడానికి మరింత కష్టపడి పనిచేద్దామని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.