బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి 2.55 గంటల సమయంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్ తమిళిసైతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు.
ఇటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం మోడీకి ఘన స్వాగతం పలికింది. తర్వాత బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో నోవాటల్ హోటల్ కు వెళ్లారు మోడీ. ఆ తర్వాత హెచ్ఐసీసీకి చేరుకుంటున్నారు. అక్కడే జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు డైనమిక్ సిటీ హైదరాబాద్ లో అడుగుపెట్టానని ప్రధాని ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తామని తెలిపారు.
ప్రధాని మోడీ షెడ్యూల్
శనివారం(జులై 2) మోడీ షెడ్యూల్
– రా.9 గంటల వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు
– రా.9 గంటల నుండి రిజర్వ్
ఆదివారం(జులై 3) మోడీ షెడ్యూల్
– ఉ.10 గంటల నుండి సా.4.30 గంటల వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు
– సా.4.30 గంటల నుండి సా.5.40 గంటల వరకు రిజర్వ్
– సా.5.55 గంటలకు హెచ్ఐసీసీ వద్ద హెలిపాడ్ కి చేరుకుంటారు
– సా.6.15 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్
– సా.6.30 గంటలకు రోడ్డుమార్గంలో పెరేడ్ గ్రౌండ్ బహిరంగ సభ
– సా.6.30 గంటల నుండి రా.7.30 వరకు బహిరంగ సభలో ఉంటారు
– రా.7.35 గంటలకు సభ దగ్గర నుండి బయలుదేరతారు
– రాత్రికి నోవాటల్ లేదా రాజ్ భవన్ లో బస
సోమవారం(జులై 4) మోడీ షెడ్యూల్
– ఉ.9.20 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్
– అక్కడి నుండి ప్రత్యేక విమానంలో విజయవాడకు పయనం
– ఉ.10.10 గంటలకు విజయవాడ