ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో ఓ రసాయన పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై ప్రధాని మోడీ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఆ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
‘‘ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు కెమికల్ యూనిట్ లో ప్రమాదం కారణంగా ప్రాణనష్టం జరగడం బాధించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి’’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.
బుధవారం అర్ధరాత్రి ఓ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
యూనిట్ 4లో గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలింది. అది అగ్ని ప్రమాదానికి దారితీసినట్టు అధికారులు భావిస్తున్నారు.