దేశంలో కరోనా వైరస్ కరోలు చాస్తుంది. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేవలం 15రోజుల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కేసుల తీవ్రత ఇలాగే ఉంటే… మరో నెల రోజుల్లో దేశంలో అదుపు చేయలేని, వైద్యం అందించలేని పరిస్థితులు ఏర్పడతాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అలాగని లాక్ డౌన్ పెట్టే పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. దీంతో ఏం చేద్దాం… కరోనా ఆంక్షలు ఎలా ఉండాలి… ఆర్థికరంగంపై ప్రభావం పడకుండా కరోనాను ఎలా అదుపు చేయాలి… వ్యాక్సినేషన్ మెరుపు వేగంతో సాగాలంటే ఏం చేయాలి… పల్స్ పోలియో మార్గదర్శకంగా నిర్ణిత వయస్సుల వారికి వ్యాక్సినేషన్ చేయలేమా… ఇలాంటి అంశాలపై ఏప్రిల్ 8న ప్రధాని సీఎంలతో సమావేశం కాబోతున్నారు.
వర్చువల్ సమావేశానికి కచ్చితంగా హజరుకావాలని పీఎంవో నుండి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలకు సమాచారం అందించారు.