సొంత వారినే పట్టించుకోని ఈ రోజుల్లో పద్మశ్రీ కిన్నెర మొగులయ్య తన పెద్ద మనసును చాటుకున్నారు. పద్మశ్రీ గ్రహిత అయినా ఆయన రోడ్డుపై మతిస్థిమితం లేని వ్యక్తిపై తన మానవత్వాన్ని ప్రదర్శించారు. శుక్రవారం ఆయన చేసిన పనికి అభినందలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకి ఆయన ఏం చేశారో మీరు తెలుసుకోండి.
మొగులయ్య ఆశయాలే కాదు.. మనసు కూడా ఎంతో గొప్పది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న మతిస్థిమితం లేని వ్యక్తికి మొగులయ్య కొత్త దుస్తులు కొనిచ్చారు. అంతేకాదు స్వయంగా వాటిని ఆయన తొడిగారు.
మతిస్థిమితం లేని వ్యక్తిపట్ల మొగులయ్య చూపిన ఆప్యాయతను చూసి చుట్టుపక్కల వారు ఆయనను అభినందించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినా మతిస్థిమితం లేని వ్యక్తి పట్ల ఆయన చూపిన మానవత్వాన్ని మెచ్చుకుంటున్నారు.
Advertisements
భీమ్లా నాయక్ సినిమాలోని పాట ద్వారా తెరపైకి మొగులయ్యకు మంచి పేరొచ్చింది. కిన్నెర వాయిద్యంతో తెలంగాణ కళను అందరికీ తెలిసేలా చేశారు. ఆయనను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. మొగులయ్య స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకుల. తాతల నుంచి తనకు అందిన 12 మెట్ల కిన్నెరతోనే ఆయన కాలం గడుపుతున్నారు.