సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో మోహన్ బాబు నటించబోతున్నారు. అవును మీరు విన్నది నిజమే. మహేష్ ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో కీలక పాత్ర కోసం మోహన్ బాబును మేకర్స్ సంప్రదించారట. మోహన్ బాబు కూడా అందుకు ఓకే చెప్పారట. నిజానికి మోహన్ బాబు ఇటీవల కాలంలో అతి తక్కువ సినిమాల్లో నటిస్తున్నారు. పాత్ర నచ్చితే మాత్రమే ఓకే చెబుతున్నారు.
గతంలో మహానటి సినిమాలో ఎస్.వి.రంగారావు పాత్రలో మోహన్ బాబు నటించారు. అలాగే ఆ తర్వాత ఆకాశం నీ హద్దురా సినిమాలో కెప్టెన్ గా నటించారు. మరి ఇప్పుడు మహేష్ సినిమాలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారో చూడాలి.
సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మహేష్ ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.