రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ చేసిన వ్యాఖ్యల పై మోహన్ బాబు స్పందించారు. నా చిరకాల మిత్రుడు సోదరుడైన పవన్ కళ్యాణ్….నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏకవచనంతో సంబోధించాను. వవన్ కళ్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమిలేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్, సంతోషమే. ఇప్పుడు మా ఎలక్షన్స్ జరుగుతున్నాయి.
నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడ్డాడు అన్న సంగతి నీకు తెలిసిందే. అక్టోబర్ 10వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతిమాటకి నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని…నీ అమూల్యమైన ఓటుని నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి, అతని ప్యానల్ కి వేసి వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ వెరీమచ్ అంటూ చెప్పుకొచ్చారు మోహన్ బాబు.