మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా నటిస్తున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. చిరు సినిమాలో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారని, ఆ పాత్ర సినిమాకు హైలెట్ గా నిలవనుందని ఓ వార్త షికార్లు కొట్టింది. అదే విషయమై చిత్ర యూనిట్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.
మోహన్ బాబు మా సినిమాలో నటించట్లేదని మోహన్ బాబు కు తగ్గ పాత్ర మా సినిమాలో లేదని తెలిపింది. మోహన్ బాబు చెయ్యవలసిన పాత్ర ఉండి ఉంటె ఖచ్చితంగా సంప్రదించే వాళ్లమని చిత్ర యూనిట్ తెలిపింది. దీనితో చిరు, మోహన్ బాబు నటిస్తున్నారన్న వార్తకు చెక్ పడింది. గతంలో ఈ ఇద్దరు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరి కలయికలో సినిమా వస్తుందని ఫాన్స్ భావించినప్పటికీ అభిమానుల కోరిక తీరలేదు.