ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సినీస్టార్స్ ఒక్కొక్కరుగా ఈ అంశంపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న మోహన్ బాబు ఇప్పుడు ఇదే అంశంపై ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలలో మోహన్ బాబు మాట్లాడుతూ వైసీపీ నాయకుల పై విమర్శలు చేశారు. రెండు సార్లు ఎమ్మెల్యే గా పని చేసిన అవంతి శ్రీనివాస్ అల్లూరి ఊరి కి ఏమి చేశారో చెప్పాలి అన్నారు. అల్లూరు ఊరికి నేను వచ్చి చూస్తాను. అవంతి శ్రీనివాస్ ఏమి చేశాడో చూస్తాను అంటు కామెంట్స్ చేశారు. మోహన్ బాబు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.