రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోహన్ బాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వెంటనే మోహన్ బాబు అక్టోబర్ 10న మా అసోసియేషన్ ఎన్నికలు ఉన్నాయని, అందులో నా బిడ్డ పోటీ చేస్తున్నాడని ఆ ఎన్నికలు అయిన తర్వాత కచ్చితంగా ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానని ప్రకటించారు.
ఇక అప్పటి నుంచి కూడా పవన్ కు మోహన్ బాబు ఎలాంటి కౌంటర్ ఇస్తారు అనే దానిపై అటు సినీ అభిమానులు, నెటిజన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. అయితే ఈ రోజు పోలింగ్ సెంటర్ వద్ద నుంచి బయటకు వచ్చిన ఒక వీడియో మాత్రం ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది.
ఓటు వేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ భుజాల పై చేయి వేసుకుని నడుచుకుంటూ మోహన్ బాబు తీసుకెళ్లాడు. నవ్వుకుంటూ మాట్లాడుతూ కూడా కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. గట్టిగా నెల రోజులు కూడా కాలేదు అప్పుడే కలిసిపోయారా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.