మోహన్ బాబు, మంచు విష్ణు, లక్ష్మీల పై ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ విపరీతంగా జరుగుతుంది. ట్వీట్ చేసినా మాట్లాడినా వెంటనే ట్రోలర్స్ సోషల్ మీడియాలో ఏకిపారేస్తూ ఉంటారు. అయితే సన్ ఆఫ్ ఇండియా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్రోలింగ్ చేస్తున్న వారి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు.
సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్ ను తెలిసినవాళ్లు అప్పుడప్పుడు నాకు పంపిస్తూ ఉంటారని… అయితే వాటిని చూసినప్పుడు కాస్త బాధగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. ట్రోల్స్ నవ్వించేలా ఉండాలని అంతే కానీ అసభ్యకరంగా ఉండకూడదన్నారు.
ఓ ఇద్దరు హీరోలు కొంతమందిని పెట్టుకొని ఇలాంటి ట్రోల్స్ క్రియేట్ చేస్తున్నారని ఆ హీరోలు ఎవరో కూడా నాకు బాగా తెలుసని అన్నారు. వాళ్ళు తాత్కాలిక ఆనందం పొందవచ్చు. కానీ ఏదో ఒక సమయంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు.
మోహన్ బాబు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆ ఇద్దరు హీరోలు ఎవరు అనే చర్చ మొదలైంది.