కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 18న విడుదలైంది. సినిమా విడుదల కాకముందే, అనేక వెబ్‌సైట్‌లు సోషల్ మీడియా పేజీలు ట్రోల్ చేసి సినిమాపై మీమ్‌లు క్రియేట్ చేశాయి. మరోవైపు, సినిమా చూసిన ప్రేక్షకులు మోహన్‌బాబు అద్భుతంగా నటించారని ప్రశంసించారు.
ఇదిలా ఉంటే, సినిమాపై హద్దులు దాటి ట్రోల్స్ చేస్తున్న వెబ్‌సైట్లపై మోహన్ బాబు, మంచు విష్ణు లీగల్ నోటీసులు జారీ చేశారు. తక్షణమే దుర్వినియోగమైన వ్యాఖ్యలను తొలగించాలని అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను కోరారు.
మేము మీ సంస్థలపై దావా వేస్తాము. రూ. 10 కోట్ల నష్టపరిహారం కోరేంత వరకు వెళ్తాము అంటూ లేఖ లో పేర్కొన్నారు. ఇక ఇటీవల మోహన్ బాబు ట్రోల్స్‌పై స్పందిస్తూ, దాని వెనుక కుట్ర ఉందని అన్నారు.
ఈ ట్రోల్స్ ముఠా వెనుక ఇద్దరు హీరోలు ఉన్నారని నాకు బాగా తెలుసన్నారు. వారు నన్ను, విష్ణు, లక్ష్మిని ట్రోల్ చేయడానికి మనుషులను నియమించుకున్నారు. కర్మ వారిని వెంటాడుతుంది. . తనకు మీమ్స్ అంటే చాలా ఇష్టమని అయితే అవి డీసెంట్‌గా ఉండాలన్నారు.