మోహన్ బాబు ఇటీవల కాలంలో పెద్దగా సినిమాల్లో నటించడం లేదు.2020 లో సూర్య హీరోగా వచ్చిన సురారై పొట్రు సినిమాలో నటించాడు. ఇక ప్రస్తుతం మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ సినిమాపై హైప్ తీసుకొచ్చింది. ఆ తరువాత ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ కూడా రాలేదు. ఇప్పుడు లాంగ్ గ్యాప్ తరువాత మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ఇక ట్రైలర్ లో మోహన్ బాబు రకరకాల గెటప్స్ లో కనిపించారు. డెమోక్రసీ లో లా ఒక్కొరికి ఒక్కోలా ఉంటె ఎలా అంటూ అదిరిపోయే డైలాగ్స్ చెప్పారు మోహన్ బాబు. అలాగే శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాను మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 18న రిలీజ్ కాబోతున్న సంగతి తెల్సిందే.
Advertisements