అనారోగ్యం కారణంగా తన రాజకీయ జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్లు రజినీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తన ఆరోగ్యం ప్రస్తుతం సహకరించడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ప్రకటనతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ కు మద్దతుగా సోషల్ మీడియా ద్వారా మంచు మోహన్ బాబు విన్నపం చేశారు. రజనీకాంత్ నాకు అత్యంత ఆత్మీయుడన్న సంగతి మీ అందరికీ తెలుసు. తన ఆరోగ్య రీత్యా రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన ప్రకటించాడు.
ఒక రకంగా తను రాజకీయాల్లోకి రాకపోవటం మీ అభిమానులందరికీ బాధ అయినప్పటికీ ఒక స్నేహితుడిగా తన ఆరోగ్యం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా తను రాజకీయాల్లోకి రాక పోవడం మంచిదని నమ్ముతున్నాను. రజనీకాంత్ అభిమానులు అందరూ ఆయనంత మంచివాళ్ళు. మీరందరూ సహృదయంతో నా మిత్రుడి నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు.