సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు మహేష్. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.
ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారట. ఒక పవర్ ఫుల్ పొలిటిషన్ గా సీఎం పాత్రలో మోహన్ లాల్ కనిపించబోతున్నారని తెలుస్తోంది.
అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రనుందట. ఇక గత గతంలో మహేష్ బాబు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో అతడు ఖలేజా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమా రాబోతోంది. మరి కాగా గతంలో మోహన్ లాల్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది.