మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వేదాళం, లూసిఫర్ రీమేక్ లలో మెగాస్టార్ నటించినున్నాడు. ఇక ఇప్పటికే వేదాళం కు సంబంధించిన మెహర్ రమేష్ కు దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు. మరోవైపు లూసిఫర్ సినిమా కోసం మొదట సాహో దర్శకుడు సుజిత్,ఆ తర్వాత వివి వినాయక్ ఇలా ఒకరి పేరు తరువాత ఒకరి పేరు తెరపైకి వచ్చింది.
ఇక ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా ధ్రువ సినిమా తమిళ మాతృక తని ఒరువన్ కు దర్శకత్వం వహించిన మోహన్ రాజా ను మెగాస్టార్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఈ సినిమా చిత్రీకరణ జరగనుందని సమాచారం.