కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రమోషన్ చేసినా కొన్ని సినిమాలు ఆడవు. కనీసం జనాల్లోకి వెళ్లలేవు. మళ్లీ ఏ ఓటీటీలోనో లేదా టీవీలోనే చూసేదాకా అలాంటి సినిమా ఒక్కటి ఉందన్న విషయం ఎవరికీ తెలియదు. కానీ రిలీజ్‌కూడా కాకముందే.. మాలివుడ్‌కు చెందిన ఓ మూవీ జాతీయ అవార్డు గెలుచుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.మోహన్‌లాల్ హీరోగా నటించిన మరక్కార్ చిత్రానికి తాజాగా ప్రకటించిన అవార్డుల్లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్ కేటగిరీల్లో అవార్డు దక్కింది. అయితే ఈ సినిమా ఏ ఫార్మాట్లోనూ, ఏ ప్లాట్‌పామ్‌పైనా విడుదల కాకపోవడం విశేషం.
వాస్తవానికి ఈ సినిమా గతేడాది మార్చి 26నే రిలీజ్ కావాల్సింది కానీ.. లాక్‌డౌన్ కారణంగా వాయిదాపడింది. కాగా ప్రస్తుతం ఈ సినిమాను మే 19న విడుదలకు సిద్ధం చేస్తున్నారు.