ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని దోచుకుతింటున్న బడా కాంట్రాక్టర్లు మెఘా కృష్ణారెడ్డి, రామేశ్వరరావు కబంధ హస్తాల నుంచి తెలుగు రాష్ట్రాలను కాపాడాలని కోరుతూ ప్రముఖ జర్నలిస్ట్ రేవతి పొగడదండ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు.
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలలో వున్న మీడియారంగంలో ఫస్ట్ ఉమెన్ సీఈవోగా పేర్గాంచిన రేవతి.. మెఘా అక్రమాలు, అరాచకాల గురించి అనేక అంశాలను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఓఎన్‌జీసీ కాంట్రాక్టు వరకు కృష్ణారెడ్డికి చెందిన సంస్థ మెఘా ఇంజనీరింగ్ ప్రజాధనాన్ని ఎలా లూటీ చేసి రెండు తెలుగు రాష్ర్టాలలో మెఘాధిపత్యం చెలాయిస్తున్నదీ రేవతి తన లేఖలో సోదాహరణంగా వివరించారు. తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాల అండదండలు చూసుకుని గంపగుత్తగా మీడియా సంస్థలను కొనుగోలు చేయడం, లేదా బలవంతంగా టేకోవర్ చేయడం, అదీ కుదరకపోతే బెదిరించి ప్రసారాలను నిలిపివేయడం.. ఇవన్నీ విచ్చలవిడిగా కొనసాగిస్తూ మీడియా స్వేచ్ఛను హరిస్తున్న మెఘా కృష్ణారెడ్డిపై పూర్తిస్థాయిలో తగిన రాజ్యంగా సంస్థల ద్వారా విచారణ జరిపించాలని రేవతి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆ లేఖలో విజ్ఞప్తిచేశారు.
లేఖ పూర్తి పాఠం ఇదీ..