పూరీ జగన్నాథ్ పూరీ మ్యూజింగ్స్ పేరుతో ఆడియోలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మనీ అనే టాపిక్ మీద వివరణ ఇచ్చారు. అప్పటి వరకు ఉన్న బాటర్ సిస్టమ్.. కాయిన్స్ కనిపెట్టాక మాయమైపోయింది. మెల్లగా కరెన్సీ నోట్టు వచ్చాయ్. ఇప్పుడు ప్రపంచంలో 180 రకాల కరెన్సీ ఉంది. అన్నీరిలిజియెన్స్ డబ్బు ముఖ్యం కాదు.. ఆత్మ, పరమాత్మ ముఖ్యం అని ఏవేవో కబుర్లు చెబితే నమ్మకండి. ఒక ధనవంతుడు తలుచుకుంటేనే దేవుడి గుడి రెడీ అవుతుంది. మిగతావాళ్లు అందరూ కలిసి హుండీలో వేసే డబ్బులతోనే గుడి రన్ అవుతుంది.
ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడు అవుతాడు. వజ్ర వైడూర్యాలు, లంకెబిందెలు ఉన్నాయని తెలిశాకే.. మనకి ఆ పద్మనాభ స్వామి ఎవరో తెలిసింది. లేకపోతే ఆ కేరళలో టెంపుల్ ఎవడికీ గుర్తుండదు. మనీని చులకనగా చూడొద్దు. రెస్పక్ట్ మనీ. మనం పూర్ పీపుల్‌కి రెస్పక్ట్ ఇస్తామా? ఇవ్వం కదా! కానీ అందరం రిచ్ పీపుల్‌కి రెస్పక్ట్ ఇస్తాం. డబ్బులేని పేదవాడ్ని, డబ్బులేని దేవుడ్ని ఎవ్వరూ పట్టించుకోరు. చాలా మంది టాలెంటెడ్ పీపుల్ లేక ఇంటిలిజెంట్ పీపుల్ డబ్బుకి రెస్పక్ట్ ఇవ్వరు. డబ్బుదేముందిలేరా.. కుక్కను కొడితే వస్తాయ్ అంటారు. దమ్ముంటే కోటి రూపాయలు సంపాదించి.. కుక్కలా తన్ను. రోడ్డుమీద విసిరెయ్. నీ మాట నేను వింటా. అందుకే టాలెంటెడ్ పీపుల్ దగ్గర కంటే లెస్ టాలెంటెడ్ పీపుల్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వారికున్న భయం వల్ల డబ్బు దాచిపెట్టుకుంటారు.
అడవిలో బతికితే కరెన్సీ అక్కరలేదు. జనం మధ్య బతికినప్పుడు మనీ కావాలి. నో సార్.. ఐయామ్ నాట్ ఇంట్రస్టడ్ ఇన్ మనీ.. బట్ ఐ వాంట్ టు స్టడీ ఐఅండ్‌రాయ్ అని నువ్వు అనవచ్చు. బట్ ఆ ఐఅండ్‌రాయ్ అనే బుక్‌కు కావాల్సిన డబ్బు అయినా సంపాదించు.
నాకు ఆస్తులు వద్దు.. అలా ప్రపంచం తిరిగివస్తాను అని నువ్వు అనుకున్నా.. ట్రావెలింగ్‌కు కూడా కొంత డబ్బు కావాలి. కాబట్టి నీ ఆశలకు కావాల్సిన కొంత డబ్బునైనా సంపాదించి పెట్టుకో. నీ రిలిజీయన్ ఎప్పుడూ.. లవ్ యువర్ నైబర్, లవ్ యువర్ నైబర్ అంటది. వింటా కూర్చుంటే.. నీ నైబర్ గాడి కష్టాలకు అంతూ పంతూ ఉండదు. మీ అమ్మ హాస్పిటల్ పాలైతే ఏ నైబరూ హెల్ప్ చేయడు. అలాగే డబ్బు కూడబెట్టడం అనేది ఎండ్‌లెస్. కానీ హవా ఐలాండ్స్ లో ఎక్స్‌పెన్సివ్ హ్యాట్‌లో ఉండటం ఎంత అవసరమో.. అక్కడున్న ఫ్రెంచ్ వైన్‌ను ఎంజాయ్ చేసే మనసు ఉండటం కూడా అంతే అవసరం. డౌన్టౌన్ పెంట్‌హౌస్‌లో వరల్డ్స్ కాస్ట్‌లీ మ్యూజిక్ సిస్టమ్ ముందు కూర్చోవడం కాదు. దాంట్లో లండన్ మ్యూజిక్‌ని ఎంజాయ్ చేస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. లేకపోతే జీవితాంతం ఈ డబ్బు చాకిరి ఎవరి కోసం. ఫైనల్‌గా నీకు టేస్ట్ ఉన్నా లేకపోయినా.. మన లైఫ్‌కి కావాల్సిన మనీని సంపాదించుకోవడం చాలా అవసరం. లెట్స్ రెస్పక్ట్ మనీ..” అని పూరి చెప్పుకొచ్చారు.