మనిషిలా కోతి ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటూ ఉంటే..ఎంత సర్ప్రైసింగ్ గా ఉంటుంది..! ఎంత పవిత్రత యాడ్ అవుతుంది. ఎన్ని రామాయణం వెర్షన్స్ మైండ్ లో రన్ అవుతాయి. అన్నిటికీ మించి ఎంత ముచ్చటగా ఉంటుందో కదా.!
ఓ కోతి ప్రతిరోజూ ఆలయానికి వెళ్లి దేవుడి ఆశీస్సులు కోరుతున్న పాత వీడియో ఒకటి లేటెస్ట్ గా మరోసారి వైరల్ అవుతోంది. సాత్విక్ సోల్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ క్లిప్‌లో కోతి కొండపైన ఉన్న గుడికి వెళ్లి దేవుడికి మొక్కడం కనిపిస్తుంది.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకూ 2 లక్షల మందికి పైగా వీక్షించారు. ప్రతిరోజూ రాత్రి సమయంలో కోతి ఆలయాన్ని సందర్శిస్తోందని వీడియోను షేర్ చేసిన యూజర్ రాసుకొచ్చారు. ఈ వీడియో అయోధ్యకు చెందినదని చెప్పారు.
మెట్లు ఎక్కి కోతి రోజూ ఆలయానికి వెళ్లి దేవుడి ఆశీస్సులు పొందుతున్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకు ఇంటర్‌నెట్ ఫిదా అయింది. పెద్దసంఖ్యలో నెటిజన్లు ఈ వైరల్ వీడియోపై రియాక్టయ్యారు. వానరం భక్తిని పలువురు యూజర్లు మెచ్చుకున్నారు.
మెట్లు ఎక్కి కోతి రోజూ ఆలయానికి వెళ్లి దేవుడి ఆశీస్సులు పొందుతున్న వీడియో pic.twitter.com/l4M6WrLAvp
— Kamal (@itsmekkprasad) March 15, 2023