అమెరికా, ఐరోపా దేశాల్లో ఇటీవల మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ఆయా దేశాల్లో ఇటీవల మంకీ ఫాక్స్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు 17 మందిలో ఈ వ్యాధిని గుర్తించినట్టు అధికారులు తెలిపారు.
అగ్రరాజ్యం అమెరికాతో పాటు బ్రిటన్, పోర్చుగల్, స్వీడన్, ఇటలీ దేశాల్లోని పలువురిలో మంకీఫాక్స్ లక్షణాలను గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. వారి రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్ లకు పంపించినట్టు అధికారులు చెబుతున్నారు.
ఈ ఫలితాలు వెల్లడయ్యాక కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్పారు. ఈ వ్యాధి జంతువుల నుంచి మనుషులకు సోకినట్టు వివరించారు.
మధ్య, పశ్చిమాఫ్రికా ప్రాంతాల్లో మే7న మొదటి కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఆ సమయంలో ఇంగ్లాండ్ కు చెందిన వ్యక్తి ఒకరు నైజీరియాకు వెళ్లారని, అతనికి ఈ వ్యాధి సోకినట్టు గుర్తించినట్టు అధికారులు పేర్కొన్నారు. అమెరికాలో తొలి కేసును మాసాచుసెట్స్ కు చెందిన వ్యక్తిలో గుర్తించినట్టు పేర్కొన్నారు.