తెలంగాణలో రుతుపవనాలు జోరుగా వీస్తున్నాయి. ఈశాన్య రుతుపనాల ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యప్రదేశ్ నుంచి ఒడిశా మీదుగా బంగాళాఖాతం వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితలద్రోణితో ఈదురు గాలులతో కూడిన వార్షాలు కురిశాయి.
రుతుపవనాలతో సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు పలుచోట్ల భారీవర్షాలు కురిశాయి. దీంతో తెలంగాణాలో భారీగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 10 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
జూలూరుపాడులో 8.5 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా మంచిప్పలో 6.6 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు అధికారులు స్పష్టం చేశారు.
మంగళవారం అత్యధికంగా సంగారెడ్డిలో 6.4 సెంటీమీటర్లు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నేరెడ్‌మెట్‌లో 5.4 సెంటీమీటర్లు, అల్వాల్ కొత్తబస్తీ 5.3, కందిలో 5, మహేశ్ నగర్ లో 4.4 సెంటిమీటర్ల వర్షం కురిసినట్టు పేర్కొన్నారు అధికారులు.