నవరత్నాలు ఆయనకు పల్లకీ మోస్తుంటే.. వరుసగా చేస్తున్న తప్పులు ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. మధ్యతరగతి ఆగ్రహిస్తుంటే.. సంక్షేమ ఫలాలు అందుకునేవారు ఇంకా అభినందనలు అందిస్తున్నారు. చదువుకున్నవారు ఛీ కొడుతుంటే.. చదువు లేనివారు.. ఇంకా ఆకలి తీరనివారు.. మాత్రం అవేమీ పట్టవంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్యూర్స్ మాత్రం లెక్కలేకుండా బయటపడుతున్నాయి. పోలీసుల పొలిటికల్ రౌడీయిజం అయితే ఇక చెప్పకోనక్కర్లేదు. ఇన్ని ఉంటే.. ఇండియా టుడే సంస్థ తన సర్వేలో జగన్మోహన్ రెడ్డికి మూడోస్థానం దక్కిందని చెప్పింది. సంక్షేమ పథకాల వల్లేనని అసమ్మతి ఎంపీ రఘరామకృష్ణంరాజు సెలవిచ్చారు. అలా అనుకున్నా కూడా.. ఆయనకు మూడో స్ధానం ఎలా దక్కిందన్నదే ప్రశ్న. దేశమంతా కలిపి 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 వేల మందిని.. అది కూడా ఫోన్ లో సంప్రదించారంట ఇండియా టుడే బృందం. దీనిని బట్టే అర్ధమవుతుంది.. ఆ సర్వే ఎంత చక్కగా జరిగిందో. కనీసం మన రాష్ట్రంలోనే 12 వేల మందిని సంప్రదించినా.. అసలు సంగతులు తెలిసేవి ఆ ఇండియా టుడేకి.
అసలు ఫస్ట్ బ్లండర్ ఏంటంటే.. మొదటి స్థానం యోగి ఆదిత్యానాథ్ కి ఇవ్వడం. ఉత్తరప్రదేశ్ లో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. పైగా ఆయన అడ్మినిస్ట్రేషన్ సరిగా చేయలేకపోతున్నారనే విమర్శలు ఎటూ ఉన్నాయి. అయినా ఆయనకు మొదటి స్థానం రావడం అంటే.. ఆలోచించాల్సిందే. పైగా ఇది మూడోసారి వరుసగా. అంటే ప్రతి సారీ.. యోగి సాబ్ దే ప్రథమ స్థానం.. ఇది ఇంకా ఆలోచించాల్సిన విషయం.
ఈ సర్వేలో మనకు కనపడే వైరుధ్యం ఏంటంటే.. అందరూ కరోనానే ప్రస్తుత పెద్ద సమస్యగా భావించినట్లు ఇచ్చారు. మరి కరోనాను కంట్రోల్ చేసిన కేరళ సీఎం అయితే మొదటి పదిమందిలో అసలే లేరు. ఢిల్లీ సీఎం మాత్రం రెండో స్థానం దక్కించుకున్నారు. ఆశ్చర్యకరంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నాలుగో స్థానంలో వచ్చారు. కేసీఆర్ తొమ్మిదో స్థానం.. కరోనాపై ఘోరంగా దెబ్బ తిన్న మహారాష్ట్ర సీఎం థాక్రే ఆరో స్థానంలో ఉండటం విశేషం. ఇలా ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి.. ఈ సర్వే ఫలితాలు. నవీన్ పట్నాయక్ కు ఒడిశాలో మంచి పరపతే ఉంది.. ఆయనకు కూడా ఎక్కడో వెనక స్థానం వచ్చింది.
మీడియాలో పాపులర్ అయి.. అది వివాదాస్పదం కావొచ్చు.. లేదా యంగ్ కావటం వల్ల కావొచ్చు.. మొత్తం మీద మీడియాలో పాపులర్ పర్సనాలిటీ అయితేనే.. ఇతర రాష్ట్రాల వారు వారిని గుర్తిస్తారు. లేదంటే .. దక్షిణాది సీఎంల గురించి.. ఉత్తరాదిలో విశ్లేషించటం చాలా అరుదు. అలా పాపులారిటీని బట్టి.. ఈ 12 వేల మంది అభిప్రాయలు చెప్పినట్లు ఉంది తప్ప.. వారి పెర్ ఫార్మెన్స్ చూసి ఇచ్చినట్లు అయితే ఖచ్చితంగా కాదు. ఇండియా టుడే లాంటి సంస్థలు.. ఇలాంటి సర్వేలు చేసి.. తమ పరపతిని పెంచుకోవడానికి చూడటమే తప్ప.. ఆ సర్వేను శాస్త్రీయంగా చేయటంపై మాత్రం దృష్టి పెట్టలేదనే చెప్పాలి. ఎప్పుడైనా గ్రౌండ్ రియాలిటీకి విరుద్ధంగా సర్వే ఫలితాలు ఉంటే.. ఆ సంస్థ క్రెడిబులిటీ కూడా దెబ్బ తింటుంది. ఏదో కమర్షియల్ పర్పస్ కోసం ఇష్టమొచ్చినట్లు సర్వేలు చేస్తే.. దారుణంగా దెబ్బతినక తప్పదు.