ఇస్మార్ట్ దర్శకుడు పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఫైటర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ లో పున ప్రారంభం కావాల్సి ఉండగా… వాయిదా పడుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి వచ్చే ఏడాదికి వాయిదా పడ్డట్లు తెలుస్తోంది.
ఇందులో కీలకంగా ఉన్న ఫైటింగ్ సీన్స్ ను బ్యాంకాక్ లో విదేశీ నిపుణులైన ఫైటర్ల పర్యవేక్షణలో షూట్ చేయాలని భావించారు. కానీ పరిస్థితులు అనుగుణంగా లేకపోవటంతో వెయిట్ అండ్ సీ పాలసీలో ఉన్నట్లు తెలుస్తోంది. అవసరం అయితే ఇండియాకే వారిని రప్పించే యోచనలో పూరీ ఉన్నారు.
అయితే, పూరీ మాత్రం షూటింగ్ పై హాడావిడిగా ఏమీ లేరని తెలుస్తోంది. పరిస్థితులు నార్మల్ అయ్యాకే… షూట్ ప్రారంభించనున్నారు. ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా, పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు.