కొత్త సంవత్సరంలో రైల్వే పనులు ను మరింత ముందుకు తీసుకుని వెళ్తామని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. ఈ మేరకు రైల్వే పనుల పురోగతి పై ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్ సెగ్మెంట్ లోని ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీర్చడం కోసం వందశాతం కేంద్రం నిధులతో నిర్మిస్తున్న పలు ఆర్వోబీల పనులు, ఆర్వోబీల అనుమతుల వ్యవహారం, కొత్త రైల్వే ప్రతిపాదనలు, వివిధ రైళ్ల పొడిగింపు పనులు రాబోయే కొత్త సంవత్సరంలో మరింత ముందుకు సాగుతాయని తెలిపారు.
ఎప్పటికప్పుడూ రివ్యూ చేస్తూ, కాంట్రాక్టర్ల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోస్తుండడంతో ఈ మధ్య రైల్వే పనులలో మరింత వేగంగా పురోగతి ఉందన్నారు.గోవింద్ పేట ఆర్వోబీ నిర్మాణం పూర్తయ్యి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు.
నిజామాబాద్ నగర వాసుల కల మాధవ్ నగర్ ఆర్వోబీ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. బోధన్ , అర్సపల్లి ఆర్వోబీ ల పనులలో కూడా వేగంగా పుంజుకుందన్నారు.
రానున్న రోజుల్లో నిజామాబాద్‌కు కొత్త రైళ్లు వేయడానికి కూడా వీలుపడుతుందని అన్నారు. బోధన్ వరకూ వెళ్తున్న రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి నిజామాబాద్ లో ఆగనుందని వెల్లడించారు.