సిరియా, టర్కీల్లో భారీ భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారు జామున సంభవించిన భూకంపం పెను బీభత్సం సృష్టించింది. భూకంపం ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 560 మందికి పైగా మృతి చెందగా.. వేలాది సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. కాగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉంది. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ‘టర్కీలో భూకంపం కారణంగా ప్రాణనష్టం & ఆస్తి నష్టం జరగడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. భారతదేశం టర్కీ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుంది. ఈ విషాదాన్ని ఎదుర్కోవడానికి అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.
భారీ భూకంప తీవ్రతకు వందలాది భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. అనేక నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 560 మందికిపైగా దుర్మరణం చెందారు. అలాగే వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. టర్కీలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
దీంతో దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాల్లో భూకంపం తీవ్ర ప్రభావం చూపించింది. 7.8 తీవ్రతతో తొలి భూకంపం సంభవించిన తర్వాత గంటల వ్యవధిలో మరో 20 సార్లు శక్తిమంతమైన భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
Anguished by the loss of lives and damage of property due to the Earthquake in Turkey. Condolences to the bereaved families. May the injured recover soon. India stands in solidarity with the people of Turkey and is ready to offer all possible assistance to cope with this tragedy. https://t.co/vYYJWiEjDQ
— Narendra Modi (@narendramodi) February 6, 2023