రష్యా దాడుల్లో కర్నాటకకు చెందిన నవీన్ మంగళవారం చనిపోయాడు. తాజాగా అతని సోదరుడు మీడియాతో మాట్లాడుతూ.. గొప్ప మనసును చాటుకున్నాడు. “చనిపోయిన నా సోదరుడు ఎలాగూ తిరిగి రాలేడు.. ప్రాణాలతో ఉన్నవారిని కాపాడి వీలైనంత త్వరగా మన దేశానికి తీసుకురండి” అని వేడుకున్నాడు.
నవీన్ డెడ్ బాడీని ఇక్కడకు తీసుకొచ్చే దానికంటే కూడా.. భారతీయులను తరలించడానికే అధిక ప్రాధానం ఇవ్వాలన్నాడు. అక్కడున్న వారికి ఏమైందోనన్న భయంతో ఇక్కడి తల్లిదండ్రులు తెగ ఆందోళన పడుతున్నారని చెప్పాడు.
ఉక్రెయిన్ లోని ఖార్కివ్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు నవీన్. మంగళవారం రష్యా సైన్యం జరిపిన క్షిపణి దాడిలో చనిపోయాడు. ఆహారం కోసం బయటకు వెళ్లి మృత్యుఒడికి చేరాడు.
ఖార్కివ్ నుంచి బయటపడి.. ఎలా భారత్ కు రావాలో తమతో నవీన్ డిస్కస్ చేశాడని.. కాసేపటికే దాడిలో చనిపోయాడని చెప్పాడు అతని సోదరుడు. తమ కుటుంబంలా ఇంకా ఎవరూ బాధపడకూడదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నవీన్ సోదరుడి వ్యాఖ్యలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.