ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే
అమిత్ షా సభ తర్వాత టీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదు. కనీసం తిండి కూడా తినడం లేదు. కేబినెట్ లో పనికి రాని, పనిలేని మంత్రులు ఉన్నారు. వంచించడం, మోసం చేయడం కేసీఆర్ కుటుంబానికే చెల్లింది. బంగారు గిన్నెలో జీవితం ప్రారంభించిన కేటీఆర్ కు పేదల కష్టాలు తెలుస్తాయా?.
తండ్రీ కొడుకుల వల్ల పురపాలక శాఖ భ్రష్టు పట్టి పోయింది. కేటీఆర్ మంత్రిత్వ శాఖలోనే అనేక కుంభకోణాలు జరిగాయి. బీజేపీని విమర్శిస్తే సహించేది లేదు. వెంటపడి తరిమి తరిమి కొడతాం. ప్రపంచ దేశాలచే ప్రశంసించబడుతున్న మోడీని కేసీఆర్ విమర్శించడం హాస్యాస్పదం.
ఏసీబీ ట్రాప్ చేసిన వారిలో ఎక్కువ మంది పురపాలక శాఖకు చెందిన ఉద్యోగులే ఉంటున్నారు. ఆ శాఖను నాశనం చేశారు కేసీఆర్, కేటీఆర్. అత్యంత అవినీతి, అసమర్థ, బాధ్యత రహిత మంత్రి కేటీఆర్. ఆసుపత్రుల్లో 5 రూపాయల భోజనం పెట్టాలనేది 8 సంవత్సరాల తర్వాత గుర్తుకు వచ్చిందా?.
అమిత్ షా మాట్లాడిన దాంట్లో అబద్దం ఏముంది? దళితులకు మూడు ఎకరాలు ఎందుకివ్వలేదు? దళితుడ్ని ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు? ప్రధాని ఆవాస్ యోజన రాష్ట్రంలో అమలు కావడం లేదు? ఇవేగా అమిత్ షా మాట్లాడింది. ఇవన్నీ అబద్దాలా? అసలు.. అబద్దాలకు, అక్రమాలకు, అరాచకాలు, అవినీతికి, అసమర్ధతకు చిరునామా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు.