ఇటీవల కాలంలో ఓటిటి లకు ఆదరణ పెరిగింది. చాలా మంది ఓటిటి లో సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్స్ లో రిలీజ్ అయిన రోజుల వ్యవధిలోనే ఓటిటి లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక శుక్రవారం చాలా సినిమాలు ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
నాగార్జున-నాగ చైతన్యల బ్లాక్‌బస్టర్ బంగార్రాజు ఫిబ్రవరి 18 నుండి ZEE5లో ప్రీమియర్‌గా స్ట్రీమ్ కాబోతుంది. ఈ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ని కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్, ZEE స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మించారు. ఈ
బాలీవుడ్ స్పోర్ట్స్ డ్రామా, 83 కూడా ఫిబ్రవరి 18 నుండి ఓటిటి లో ప్రసారం కానుంది. అయితే, ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ మరియు డిస్నీ+ హాట్‌స్టార్ రెండు ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి రానుంది.
అలాగే విశాల్, ఆర్య నటించిన యాక్షన్-ప్యాక్డ్ ఎనిమీ కూడా ఫిబ్రవరి 18న సోనీ లివ్‌లో ప్రీమియర్‌గా స్ట్రీమ్ కాబోతుంది. ఆనంద్ శంకర్ ఈ చిత్రానికిదర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మిశ్రమ స్పందనలను అందుకుంది.
ఇక త్రిష, సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 96 సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కాబోతుంది. రొమాంటిక్ లవ్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమా ఇప్పుడు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో ఆహా ఓటిటి
లో విడుదలవుతోంది.
శ్రుతి హాసన్ నటించిన మొదటి ఓటిటి సిరీస్, బెస్ట్ సెల్లర్ కూడా ఫిబ్రవరి 18, 2022న అమెజాన్ ప్రైమ్ లో ప్రీమియర్ అవుతుంది. ఈ సిరీస్‌లో మిథున్ చక్రవర్తి, అర్జన్ బజ్వా, శ్రుతి హాసన్ మరియు గౌహర్ ఖాన్ నటించారు. ఈ సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్‌ను కొద్ది రోజుల క్రితం విడుదల చేయగా, దీనికి మంచి స్పందన వచ్చింది.