కరోనా వల్ల చాలా రోజుల పాటు ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. కానీ చివరకు ఇంటికి వెళ్దామని నిర్ణయించుకున్నా. ఓ వైపు వైరస్ భయం వెంటాడుతోంది. అయినప్పటికీ రైలులో ప్రయాణం చేద్దామని నిర్ణయించుకున్నా. కరోనా వల్ల రైళ్లలో చాలా తక్కువ మంది ఉన్నారు. నేను ట్రెయిన్ ఎక్కబోతుండగా నాకు కింద ఇచ్చిన ఫొటో మాదిరిగా ఓ అమ్మాయి ట్రెయిన్‌లో కిటికీ వద్ద కూర్చుని కనిపించింది. లోలోపల సంతోష పడుతూ నా లక్ బాగున్నందుకు ఎంతో ఎగ్జయిట్‌మెంట్ ఫీలయ్యా.
ట్రెయిన్‌లో నేను ఉన్న కంపార్ట్‌మెంట్‌లో ఆ అమ్మాయి, ఆమె తల్లి ఇద్దరు మాత్రమే ఉన్నారు. నేను, ఆ అమ్మాయి ఇద్దరం ఎదురెదురుగా కిటికీల వద్ద కూర్చున్నాం. ఆమె తల్లి పైన పడుకుంది. పైన ఉన్న మహిళ ఆ అమ్మాయి తల్లి అని తరువాత కొంత సేపటికి నాకు తెలిసింది. కంపార్ట్‌మెంట్‌లో మేం ముగ్గురం మాత్రమే ఉన్నాం. నా సీట్‌ను నేను శానిటైజ్ చేసి దానిపై కూర్చున్నా. బ్యాగ్‌లోంచి ఓ నవల తీసి చదవడం ప్రారంభించా. రాత్రి పూర్తి చేసిన భాగం తరువాతి నుంచి నవలను చదవడం ప్రారంభించా.
కొంత సేపటికి పైన బెర్త్‌లో ఉన్న ఆ అమ్మాయి తల్లి ఆమెను పైకి బ్యాగ్ ఇవ్వమని అడిగింది. కానీ ఆ బ్యాగ్ బరువుగా ఉండడం వల్ల ఆ అమ్మాయి దాన్ని మోయలేకపోయింది. నేను సహాయం చేశా. ఆమె నాకు థ్యాంక్స్ చెప్పింది. తరువాత ఆమె నేను చదువుతున్న నవల చూసి.. అది జూలియన్ మాంటిల్ నవలా..? అని అడిగింది. అందుకు నేను.. అవునని.. సమాధానం చెప్పా. మీకు నవలలు చదవడం అంటే ఇష్టమా అని నేను ఆమెను అడిగా.. అందుకు ఆమె కూడా యెస్ అని చెప్పింది.
తరువాత ఆమె తాను చెవులకు పెట్టుకున్న ఇయర్ ఫోన్స్‌ను తీసి నెమ్మదిగా నాతో మాట్లాడుతూ నా వివరాలు అడగసాగింది. నేనూ చెప్పా. ఆమె వివరాలను నేనూ అడిగా. ఇద్దరమూ ఒకే గమ్యస్థానం చేరాలని తరువాత తెలుసుకున్నాం. ఆమె తాను బీటెక్ చేసి జాబ్ కోసం సెర్చ్ చేస్తుందని, కరోనా వల్ల జాబ్స్ దొరకడం లేదని చెప్పింది. నేను నా స్టోరీని ఆమెకు చెప్పా. కానీ ఆమె తల్లి పైనే ఉండడం వల్ల నేను ఆమెతో మాట్లాడడం ఆమె తల్లికి ఇష్టం, ఉందో లేదోనని భయపడ్డా. అదేవిషయాన్ని ఆమెకు చెప్పా. కానీ అందుకు ఫర్లేదని సమాధానమిచ్చింది. తన తల్లి చాలా ఓపెన్ మైండెడ్ అని.. ఇలాంటి విషయాలు పట్టించుకోదని చెప్పింది.
తరువాత కొంత సేపటికి ఆమె తాను దిగాల్సిన స్టేషన్ మరో 5 కిలోమీటర్లు ఉందని చెప్పింది. నిజంగా నాకు లైఫ్‌లో ఆ సంఘటన ఎప్పటికీ మరిచిపోలేని సంఘటనగా మారుతుందని అనుకుంటుండగా.. ఆమె ఓకే, జై.. బై.. నా స్టేషన్ వచ్చేసింది.. అని చెప్పింది. వెంటనే నేను.. నా పేరు జై కాదని అన్నా.. అంతే.. మరుక్షణం లేచి చూసే సరికి ఆ సంఘటన తియ్యని కల అని తెలుసుకుని విచారించా. నాకు ఆ కల ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ ఆమె గొంతు మాత్రం ఎంతో మధురంగా వినిపించింది. అది నిజమేనేమో అనిపించింది. ఆ సంఘటన నిజం అయితే ఎంత బాగుండును..!