తల్లిపాలు బిడ్డలకు ఎంత మేలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో వ్యాధులకు పరిష్కారం తల్లి పాలు. పోషక విలువలతో పాటు వ్యాధి నిరోధక శక్తి ఉండే తల్లిపాలనే డాక్టర్లు బిడ్డకు పట్టించాలని చెప్తారు.
పుట్టిన రోజునాడు యువతిపై గ్యాంగ్ రేప్
కానీ బిజీ జీవితంలో తమ బిడ్డలకు తల్లిపాలు పట్టలేకపోతున్నాం అని బాధపడే వారు కొందరైతే, తల్లిపాలు పట్టడం వల్ల తల్లి అందం పోతుందని బిడ్డకు పాలివ్వని తల్లులు కూడా ఉన్నారు. అంతేకాదు బిడ్డకు తల్లిపాలు సరిపడా ఇవ్వలేని వారి బాధ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులకు పరిష్కారం అంటూ తల్లిపాలను అమ్మకానికి పెట్టారు.
లవర్ ముఖంపై యాసిడ్ పోసిన యువతి
తల్లి పాలను ప్రాసెస్ చేసి… స్టోర్ చేస్తూ మదర్ మిల్క్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చేసింది. తొలిసారి హైదరాబాద్‌లో నిలోఫర్ ఆసుపత్రిలో ఈ మిల్క్ బ్యాంకు ప్రారంభం కాగా… మరో రెండు కార్పోరేట్ ఆసుపత్రులు కూడా ఇప్పుడు మార్కెట్‌లోకి తెచ్చాయి. తల్లి నుండి సేకరించిన పాలను ప్రాసెస్ చేసి… ఎలాంటి వ్యాధులు లేవని నిర్దారించుకున్న తర్వాతే అమ్మకానికి పెడుతారు.
ఈ పాల బాటిల్‌కు 250 రూపాయల వరకు చార్జ్ చేస్తున్నారు.