– ఆగని అధికార మదం
– టీఆర్ఎస్ నేతల ఇబ్బందులు
– తల్లికొడుకులు ఆత్మహత్య
– సెల్ఫీ వీడియో తీసిన బాధితులు
– మానసికంగా కుంగిపోయేలా చేశారని ఆవేదన
– ఓ పోలీసు అధికారి అండతో ఇబ్బందులు
– సెల్ఫీ వీడియో వైరల్
– కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన
అధికారం ఉందని ధనవంతులు ఆడుతున్న ఆటలకు అమాయకులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటీవల ఖమ్మంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాఘవ ఘటన మరవకముందే మరో టీఆర్ఎస్ నేత ఆగడాలకు రెండు ప్రాణాలు బలయ్యాయి. టీఆర్ఎస్ నేతల ఆగడాలను భరించలేక తమ గోడును సెల్ఫీ వీడియో ద్వారా చెప్పుకొని.. తల్లికొడుకులు నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలోని న్యూ మహారాజా లాడ్జి గదిలో చోటుచేసుకుంది.
జిల్లాలోని రామాయంపేట్ కు చెందిన పద్మ, ఆమె కుమారుడు సంతోష్ తో కలిసి నివసిస్తోంది. సంతోష్ వ్యాపారాలు చేస్తూ జీవించేవాడు. ఈ నేపథ్యంలో తనతో పాటు పాట్నర్ గా ఉన్న వ్యక్తి తో పాటు.. మరో ఏడుగురు తనను ఇబ్బుందులకు గురిచేస్తున్నారని.. తన వ్యాపారాన్ని సాగనివ్వడం లేదని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వీడియో చేసి ప్రాణాలను తీసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదిలా ఉంటే.. తల్లి పద్మకు ఆరోగ్యం బాగలేదని.. వైద్యం కోసం వచ్చామని ఈ నెల 11న లాడ్జిలో దిగారు. గదిలో తాళం బిగించి పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నారు. తెల్లవారుజామున గది నుండి పొగలు రావడం గమనించిన లాడ్జి సిబ్బంది. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న డీఎస్పీ సోమనాథం, సీఐ నరేష్ లు.. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అయితే.. వారి ఆత్మహత్యకు కారణం ఏడుగురున్నట్టుగా రాసిన సుసైడ్ లేఖను పోలీసులు ఘటనాస్థలిలో స్వాధీనం చేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు తల్లీకుమారుడు ఓ సెల్ఫీ వీడియో చిత్రీకరించారు. ఈ వీడియోలో వారి వ్యథను వెల్లిబుచ్చారు. ఆత్మహత్య చేసుకోడానికి కారణమైన వారి గురించి.. వారు తమ కుటుంబానికి చేసిన మోసాలు, పెట్టిన ఇబ్బందుల గురించి చెప్తూ.. కన్నీటి పర్యంతమయ్యారు.
“బాసం శ్రీనుతో కలిసి నేను వ్యాపారం చేశా. శ్రీను వద్ద డబ్బులు లేకపోతే జితేందర్ గౌడ్ ఇచ్చాడు. తర్వాత వ్యాపారంలో 50శాతం వాటా కావాలని జితేందర్ గౌడ్ కోరారు. ఇవ్వలేమని.. కుదరదని చెప్పాం. ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెడితే నన్ను పీఎస్‌కు పిలిచారు. నా ఫోన్‌ను అప్పటి సీఐ నాగార్జున గౌడ్ తీసుకున్నారు. నన్ను కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారు. దీనిపై మరుసటి రోజే మెదక్ ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశా”.
“10 రోజులయ్యాక ఫేస్‌బుక్ అంశంలో సంబంధం లేదన్నారు. నా ఫోన్‌లో సమాచారాన్ని పోలీసులు జితేందర్‌గౌడ్‌కు ఇచ్చారు. అప్పటి నుంచి జితేందర్‌గౌడ్ మనుషులు ఫోన్‌లోని సమాచారంతో ఇబ్బంది పెట్టారు. నన్ను బెదిరించే విషయాన్ని కూడా పీఎస్‌లో ఫిర్యాదు చేశాను. ఏడాది పాటు జితేందర్ గౌడ్ మనుషులు నన్ను ఇబ్బంది పెట్టారు. నా వ్యాపారం సాగనీయలేదు, అర్థికంగా నష్టపోయాను. అప్పులు చేశాను. నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు. నన్ను మానసికంగా కుంగిపోయేలా చేశారు. నమ్మిన స్నేహితుడే దగా చేయడం తట్టుకోలేకపోయాను. వాళ్ల ఇబ్బందులు తట్టుకోలేకనే నేను, అమ్మ చనిపోతున్నాం” అని సెల్ఫీ వీడియోలో లో చెప్పారు తల్లీ కొడుకులు