కరోనా మహమ్మారి కారణంగా గత ఎనిమిది నెలల నుంచి సినిమా థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఇక ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు లభించడంతో థియేటర్ లు ఓపెన్ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో థియేటర్లు ప్రారంభం కాకపోవడం వల్లే చాలా మంది నిర్మాతలు తమ చిత్రాలను విడుదల చేయలేక పోయారు.
మరోవైపు ఏపీలో థియేటర్లు కూడా పూర్తిస్థాయిలో ఓపెన్ కాలేదు. అక్కడక్కడ థియేటర్లను మాత్రమే ప్రారంభించారు. అయితే డిసెంబర్ 4న మల్టీప్లెక్స్ లు, యజమాని సొంతంగా నిర్వహించుకునే థియేటర్లలో సినిమా ప్రదర్శనలు మొదలవనున్నాయి. ఆ తరువాత ఈ నెల 11న కొన్ని థియేటర్లు, 18న ఇంకొన్ని థియేటర్లు ప్రారంభం కావచ్చని సమాచారం.