రాజీవ్ కనకాల. సెటిల్డ్ పెర్ఫార్మర్. ఏ పాత్రనైనా అద్భుతంగా పండించగల నటుడాయన. సీనియర్ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కుమారుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందకు పైగా చేసి మెప్పించారు.
తొలినాళ్ళల్లో దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన రాజశేఖర చరిత్ర, డామిట్ కథ అడ్డం తిరిగింది వంటి సీరియల్స్ లో రాజీవ్ కనకాల నటించారు. క్రమేణా విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రాజీవ్. మూడు దశాబ్దాలుగా నట ప్రస్థానాన్ని కొనసాగించిన ఆయన 150 చిత్రాల్లో నటించారు.
స్టూడెంట్ నంబర్1 సినిమా తర్వాత రాజీవ్ హీరోగా కూడా కొన్ని సినిమాలు చేసారు. ఏ ఫిల్మ్ బై అరవింద్ సినిమాలో ఆయన చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. తన కెరీర్ లో సహాయ నటుడిగా కన్నా ఎక్కువగా విలన్ పాత్రలు చేసారు.
స్టార్ యాంకర్ సుమ ఈయన సతీమణి అన్న విషయం మనకు తెల్సిందే.తనకు సినిమాలు, ఛాన్సులు కావాలని ఎవరినీ అడగనని ఇచ్చిన పాత్రకు న్యాయం చేస్తానని నమ్మినవారే తనకు ఛాన్స్ ఇస్తారని ఆయన తెలిపారు. అయితే ఎక్కువగా సినిమాల్లో ఈయన చనిపోయే పాత్రలేమనం చూసాం.రాజీవ్ ని మధ్యలోనే సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
1 స్వామి
ఈ చిత్రంలో రాజీవ్ కనకాల విలన్ పాత్రలో నటించారు.
2 అశోక్
ఈ చిత్రంలో రాజీవ్ కనకాల ఎన్టీఆర్ స్నేహితుడి పాత్రలో నటించారు.
3 రాజుగారి గది 2
ఈ చిత్రంలో రాజీవ్ కనకాల హీరో అన్నయ్యగా నటించారు.
4 ఏ ఫిల్మ్ బై అరవింద్
ఈ చిత్రంలో రాజీవ్ కనకాల విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు.
5 అతడు
ఈ చిత్రంలో రాజీవ్ సింపతీ గెయిన్ చేసే పార్థు పాత్రలో నటించారు.
6 హరే రామ్
ఈ చిత్రంలో రాజీవ్ కనకాల డాక్టర్ పాత్రలో నటించారు.
7 అతిథి
ఈ చిత్రంలో రాజీవ్ కనకాల గౌతమ్ అనే పాత్రలో నటించారు
8 దూకుడు
ఈ చిత్రంలో రాజీవ్ కనకాల మహేష్ బాబు బాబాయ్ పాత్రలో నటించారు.
9 బాద్ షా
ఈ చిత్రంలో రాజీవ్ కనకాల డాక్టర్ పాత్రలో నటించారు.
10 రాజా ది గ్రేట్
ఈ చిత్రంలో రాజీవ్ కనకాల పాత్ర మరణిస్తుంది.
11 లవర్
ఈ చిత్రంలో రాజీవ్ కనకాల జగ్గు అనే పాత్రలో నటించారు.
12 రంగ స్థలం
ఈ చిత్రంలో రాజీవ్ కనకాల రంగమ్మత్త భర్త పాత్రలో నటించారు.
13 బింబిసార
ఈ చిత్రంలో రాజీవ్ కనకాల రాజీవ్ అనే పాత్రలో నటించారు.
14 వీర సింహా రెడ్డి
ఈ సినిమాలో కూడా రాజీవ్ కనకాల పాత్ర చనిపోతుంది.