సినిమా అనేది రంగుల ప్రపంచం. మూవీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. స్టార్ కిడ్ అయినా.. సామాన్య వ్యక్తి అయినా ప్రేక్షకులు ఆదరిస్తే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఎప్పుడు హిట్ వస్తుందో, ఎప్పుడు ఫ్లాప్ వస్తుందో తెలియని పరిస్థితి. మంచి కథలు ఎంచుకున్నా.. అవి ఒక్కోసారి రివర్స్ అవుతూంటాయి. సినిమాకి మౌత్ టాక్, క్రిటిక్స్ టాక్ బాగా వచ్చినంత మాత్రాన అది బాక్సాఫీస్ వద్ద బాగా ఆడింది లేదు. అందుకు కొన్ని సినిమాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 2022లో కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా.. బాక్సఫీస్ వద్ద మాత్రం ఆశించిన రేంజ్ లో ఫలితాలను అందుకోలేకపోయాయి. చివరికి నష్టాలను మిగిల్చాయి. ఆ చిత్రాలేంటో ఓసారి చూసేద్దాం.
1. 18 పేజెస్:
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ రీసెంట్ గా జంటగా నటించిన ఈ మూవీ రిలీజ్ రోజున పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ బ్రేక్ ఈవెన్ కావడానికి చాలా కష్టపడుతుంది. రూ.13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ రూ.8.32 కోట్ల షేర్లు మాత్రమే రాబట్టింది.
2. భీమ్లా నాయక్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం.. మొదటి రోజు సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుంది అనుకున్నారు. కానీ కట్ చేస్తే బాక్సాఫీస్ వద్ద తన జోరు చూపించలేకపోయింది భీమ్లా నాయక్.
3. అంటే సుందరానికి:
నాని హీరోగా.. నజ్రియా ఫహాద్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి ‘బ్రోచేవారెవరురా’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకుడు. ఈ చిత్రానికి కూడా ఫస్ట్ డే హిట్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం నిరాశపరిచింది.
4. విరాటపర్వం:
రానా, సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన విరాటపర్వం రిలీజ్ రోజున హిట్ టాక్ వచ్చింది. కానీ బాక్సఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. రూ. 13.6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ ఫుల్ రన్ ముగిసే సరికి కేవలం రూ.4.23 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.
5. సమ్మతమే:
కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం రిలీజ్ రోజు మంచి టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ తో సరిపెట్టుకుంది. రూ.4.5 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ ఫుల్ రన్ లో రూ. 3.10 కోట్ల షేర్లు మాత్రమే రాబట్టింది.
6. అశోకవనంలో అర్జున కళ్యాణం:
విష్వక్సేన్ హీరోగా నటించిన ఈ మూవీకి కూడా మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ బాక్సఫీస్ వద్ద నిలబడలేకపోయింది. రూ.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ ఫుల్ రన్ లో రూ.4.57 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి ఫెయిల్యూర్ గా మిగిలింది.
7. గాడ్ ఫాదర్:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి రోజు సూపర్ హిట్ టాక్ వచ్చింది. అయితే రూ. 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. కానీ ఫుల్ రన్ లో కేవలం రూ. 58.65 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.
8. స్వాతిముత్యం:
స్వాతిముత్యం చిన్న సినిమాగా రిలీజ్ అయినప్పటికీ రిలీజ్ రోజు హిట్ టాక్ ను తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి కేవలం రూ.0.96 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.
9. ఊర్వశివో రాక్షసివో:
అల్లు శిరీష్ హీరోగా నటించిన ఈ మూవీకి మొదటి రోజు హిట్ టాక్ లభించింది. కానీ బాక్సాఫీస్ వద్ద రూ.6.75 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్ లో కేవలం రూ.3.32 కోట్ల షేర్లు మాత్రమే రాబట్టింది.
10. ఓరి దేవుడా:
విష్వక్సేన్ హీరోగా నటించిన ఈ మూవీలో ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ కూడా కీలకపాత్ర పోషించారు. ‘ఓ మై కడవులే’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు సూపర్ హిట్ టాక్ ను రాబట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద రూ.5.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ. 5.55 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి అబౌవ్ యావరేజ్ గా ఫలితంతో సరిపెట్టుకుంది.