ఉక్రెయిన్- రష్యా సరిహద్దుల్లో ఇటీవల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లోని తమ రాయబార కార్యాలయంలోని సిబ్బందిని పోలండ్ కు తరలిస్తున్నట్టు అమెరికా సంయుక్త రాష్ట్రాలు మంగళవారం తెలిపాయి.
యూఎస్ పౌరుల రక్షణ, భద్రతా దృష్ట్యా ఈ చర్యలను తీసుకున్నట్టు యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనను చేసింది.
‘ భద్రతా కారణాల రీత్యా ఎల్వీవ్ లో ఉన్న డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ సిబ్బందిని పొలాండ్ కు తరలించాము. మా సిబ్బంది ఇక్కడి నుంచి పని చేస్తారు. అత్యవసవర రాయభార సేవలను ఇక్కడి నుంచే అందిస్తారు ” అని యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ తెలిపింది.
ఉక్రెయిన్ నుంచి విడిపోయిన రెండు ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా తాము గుర్తిస్తున్నట్టు ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రకటించారు. దీంతో ఇరు దేశాల సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.