కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్ బిల్లుపై సీఎం కేసీఆర్ మాటలపై బీజేపీ ఎంపీ అరవింద్ తీవ్రంగా మండిపడ్డారు. సీఎం బిల్లులోని వివరాలు చదివి మాట్లాడాలన్నారు. సీఎం తనకు నచ్చినట్లు అబద్ధాలు చెప్తుంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా చప్పట్లు కొట్టారన్నారు.
కొత్త చట్టంతో ఉచిత విద్యుత్ ఇవ్వలేమని కేసీఆర్ చెప్పటం అబద్ధమన్నారు. బిల్లులోని అంశాలన్నీ చదివితే నిజాలు తెలుస్తాయని, చదవకుండా అబద్ధాలు చెప్పొద్దని మండిపడ్డారు. కొత్త విద్యుత్ బిల్లుపై సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు నిజమైతే తాను ఉరేసుకుంటానని, లేదంటే నువ్వు ఉరేసుకుంటావా అని సీఎం కేసీఆర్ కు ఎంపీ అరవింద్ సవాల్ విసిరారు. విద్యుత్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడం బిల్లు ఉద్దేశమని, డిస్కంలు నిర్వీర్యం అవుతాయని కేసీఆర్ అనడాన్ని తప్పుపట్టారు. ఈ చట్టం వల్ల డిస్కంలు బలపడతాయని, తెలంగాణలో విద్యుత్ వ్యవస్థ రూ.30 వేల కోట్లు నష్టాల్లో ఉందని, గత ఆరున్నరేళ్లలో ఒక్క మెగా వాట్ విద్యుత్ కూడా పెంచలేదని విమర్శించారు. ఇలా సీఎం కేసీఆర్ ఎలా విద్యుత్ రంగాన్ని మెరుగుపరుస్తారని ఆయన ప్రశ్నించారు.