తెలంగాణలో ఇకమీద సెంటిమెంట్ తో టీఆర్ఎస్ గెలవటం కల్ల అని ఎంపీ అరవింద్ విమర్శించారు. మంత్రిగా కేటీఆర్ ఒక్క పరిశ్రమను కూడా అదనంగా హైదరాబాద్ కు తీసుకరాలేకపోయారన్నారు.
సచివాలయానికి వెళ్లని సీఎం కేసీఆర్ దేశానికి దిశ దశా చూపుతారా…? అని ప్రశ్నించారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు లేకపోయినా, కేసీఆర్ కుటుంబం నెలకు 15 లక్షల జీతం తీసుకుంటోందని ఆరోపించారు. మేయర్ సీటు బీజేపీకి ఇస్తే వరద బాధితులకు 25వేల సాయం చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఆరున్నరేళ్ళుగా తెలంగాణలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు.
తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని ఎంపీ అరవింద్ విమర్శించారు.