సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై బీజేపీ ఎంపీ అరవింద్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు ఏం అర్హత ఉందని సీఎంను చేస్తానంటున్నారని ప్రశ్నించారు. నిజామాబాద్ ఓటమి తర్వాత కవిత మళ్లీ ఎన్నికల్లో పోటీచేస్తారని అనుకోవటం లేదని… తెలంగాణ ద్రోహులందరూ మంత్రులయ్యారన్నారు.
ప్రొ.జయశంకర్‌ను కంట తడి పెట్టించిన మూర్ఖుడు కేసీఆర్ అని, 80 వేల పుస్తకాలు చదివిన అజ్ఞాని అంటూ మండిపడ్డారు. ఆయన సంస్కార హీనుడని… పాస్‌పోర్టు బ్రోకర్ రాష్ట్రానికి సీఎం కావడం ప్రజల దురదృష్టకరమంటూ వ్యాఖ్యానించారు.
ప్రగతి భవన్ పై తన ఆరోపణలు ఎంపీ అరవింద్ కొనసాగించారు. మైనింగ్ వ్యవహారంలో కేసీఆర్, ఆయన కుటుంబం జైలుకి వెళ్లటం ఖాయమని జోస్యం చెప్పారు. బండి సంజయ్ హిందుత్వాన్ని ప్రశ్నించే అర్హత టీఆర్ఎస్‌కు లేదని, బండి సంజయ్ నాయకత్వంలో అధికారంలోకి వస్తామని ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు.