ఓవైసీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ అంటూ ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ అరవింద్. మున్సిపల్ ఎన్నికల ముందు ఓవైసీతో కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని, ప్రకటన కూడా రాని ఎన్‌ఆర్సీపై ఎందుకు ఈ అనవసర రాద్దాంతమని విమర్శించారు.
కేసీఆర్ అండతో నిజామాబాద్‌లో సభ నిర్వహణకు ఎంఐఎం ప్రయత్నిస్తోందని, ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీలు, సభలకు ఎలా అనుమతి ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఓవైసీ కోసం తెలంగాణలో మతసామరస్యాన్ని ఫణంగా పెడుతున్నారని అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.