ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లో ఒవైసీని క్రేన్ తో వేలాడదీస్తానని వ్యాఖ్యానించారు. ఒవైసీ గడ్డాన్ని తీసి సీఎం కేసీఆర్ కు అతికిస్తానన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంకు తొత్తుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. నిజామాబాద్ లో బీజేపీ బలపడుతుండటంతో జిల్లా మేయర్ పీఠాన్ని ఎంఐఎం కు అప్పగించే కుట్రలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా అరవింద్ వ్యాఖ్యలు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి.