వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలివ్వాలని కోరుతూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు కాబట్టి విచారణ మొత్తం వీడియో తీసేలా ఆదేశాలివ్వాలని తన పిటిషన్‌లో కోరారు. 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేయకూడదని అవినాష్ రెడ్డి కోరుతున్నారు.
శుక్రవారం అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఆయనను సీబీఐ మూడో సారి విచారణకు పిలిచింది. ఈ సారి అరెస్ట్ చేయడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం ఆసక్తి రేపుతోంది.